నా లైఫ్ పార్ట్‌‌నర్‌‌ ఎలా ఉండాలంటే..

నా లైఫ్ పార్ట్‌‌నర్‌‌ ఎలా ఉండాలంటే..

హైదరాబాద్: మాల్దీవులకు వెకేషన్‌‌కు వెళ్లిన టాలీవుడ్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తిరిగొచ్చింది. వర్కవుట్స్‌‌, సినిమా షూటింగ్స్‌తో తిరిగి బిజీ అయిపోయింది. ఇదిలాఉంటే.. రకుల్ తనకు కాబోయే లైఫ్ పార్ట్‌‌నర్, ప్రేమ, పెళ్లి, వివాహం లాంటి అంశాల గురించి అభిప్రాయాలు చెప్పింది. ప్రేమ కోసం పరితపించే, వివాహాంపై పూర్తి నమ్మకం కలిగిన వ్యక్తినే పెళ్లాడతానని తెలిపింది.  ‘నా భాగస్వామికి జీవితం మీద మంచి అభిరుచి ఉండాలి. అనుబంధాలకు విలువిచ్చే, ఆర్మీ నేపథ్యం కలిగిన కుటుంబం నాది. నా జీవితంలో వచ్చే వ్యక్తి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంజాయ్ చేసే వాడై ఉండాలి. ఇక పెళ్లి విషయానికొస్తే.. దగ్గరి బంధువులు, 100 మంది క్లోజ్ ఫ్రెండ్స్‌‌‌‌ మాత్రమే పెళ్లిలో ఉండేలా ప్లాన్ చేస్తా. బీచ్‌‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతా’ అని రకుల్ ప్రీత్ పేర్కొంది.

ప్రస్తుతం జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్న రకుల్.. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ సరసన ఒక సినిమాలో ఆడిపాడనుంది. సర్దార్ అండ్ గ్రాండ్‌‌సన్ టైటిల్‌‌తో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్‌‌ సరిహద్దు ప్రేమకథగా రూపుదిద్దుకుంటోంది. బిగ్ బీ అమితాబ్, అజయ్ దేవగణ్ నటిస్తున్న మేడేలో కో-పైలట్‌‌గా, జాన్ అబ్రహాం సరసన అటాక్ మూవీలో, సిద్ధార్థ్ మల్హోత్రా పక్కన థ్యాంక్ గాడ్‌‌లోనూ రకుల్ అలరించనుంది.