ఒక షాట్ కోసం నీటి అడుగున రెండు నిమిషాలు.. రకుల్ నువ్వు నిజంగా గ్రేట్

ఒక షాట్ కోసం నీటి అడుగున రెండు నిమిషాలు.. రకుల్ నువ్వు నిజంగా గ్రేట్

సినిమాలో ఒక సీన్ కోసం రకుల్ ప్రీత్ సింగ్(Rakul preet singh)  చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వర్క్ పట్ల ఆమెకున్న డెడికేషన్ ను ప్రశంసిస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఐ లవ్ యూ(I love you) అనే సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమాలో ఒక సీన్ ను నీటి అడుగున చేయాల్సి వచ్చిందట. ఈ సీన్ కోసం దాదాపు రెండు నిమిషాల ముప్పై సెకన్లపాటు గాలి పీల్చుకోకుండా ఉందట రకుల్. 

సినిమాలో చాలా కీలక సమయం లో వచ్చే ఈ సీన్ కోసం రకుల్ చాలా ప్రాక్టీస్ చేసిందట. ఊపిరి ఆపడం కోసం కొన్ని యోగాసనాలు కూడా ప్రాక్టీస్ చేసిందట. ఆ సీన్ చేసిన తరువాత చిత్ర యూనిట్ నుండి కూడా ప్రశంసలు దక్కాయట.  తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి.  వీటిని చూసిన వారంతా షాక్ అవుతున్నారు.. రకుల్ డేర్ కు ఫిదా అవుతున్నారు. రకుల్ కు వర్క్ పట్ల ఉన్న డెడికేషన్ గురించి చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ నువ్వు నిజంగా గ్రేట్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.