
హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టగ్రమ్ లో పోస్ట్ చేశారు. కోవిడ్ 19 టెస్టు చేయించుకోగా తనకు పాజిటివ్ వచ్చిందన్నారు. పాజిటివ్ వచ్చిన వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లినట్లు చెప్పారు. ప్రస్తుతానికి తాను క్షేమంగా ఉన్నానని..రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పారు. కరోనా నుంచి కోలుకుని త్వరలో షూటింగ్ లో పాల్గొంటానని చెప్పారు. ఇటీవల తనను కలిసన వాళ్లంతా కోవిడ్ టెస్టు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.