డ్రగ్స్ కేసులో ముగిసిన రకుల్ ప్రీత్ విచారణ

V6 Velugu Posted on Sep 03, 2021

తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విచారణ వేగవంతం చేసింది. శుక్రవారం ఉదయం నుంచి దాదాపు 6గంటల పాటు ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రకుల్‌ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు.. లావాదేవీలపై ప్రశ్నించినట్టు సమాచారం. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల తో ఉన్న సంబంధాల పై ఆరా తీశారు. దీనికి సంబంధించి రకుల్  స్టేట్ మెంట్ లిఖిత పూర్వకంగా నమోదు చేసుకున్నారు ఈడీ అధికారులు. ఆ తర్వాత ఎప్పుడు పిలిచిన విచారణ కు హాజరు కావాలని రకుల్ ను ఈడీ అదేశాలు జారీ చేసింది.


షూటింగ్స్‌ ఉండటం కారణంగా తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానని.. కాస్త గడువు ఇవ్వాలని ఈడీ అధికారులను రకుల్‌ కోరారు. అందుకు అంగీకరించని అధికారులు.. మూడు రోజుల ముందుగానే  ఆమెను విచారించారు. 


ఈ నెల 8వ తేదీన రానా ఈడీ విచారణకు రానున్నారు.

Tagged Rakul Preet Singh, ED, Drugs Case, trial ends

Latest Videos

Subscribe Now

More News