నా స్పీడ్ ఇప్పుడప్పుడే తగ్గదు

నా స్పీడ్ ఇప్పుడప్పుడే తగ్గదు

కెరీర్ ప్రారంభంలోనే సక్సెస్ కొట్టిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత టాప్ హీరోల సరసన చోటు సంపాదిస్తూ జెట్‌‌ స్పీడ్​లో సాగింది. అయితే ఓ సమయంలో అసలు తెలుగు సినిమాల్లోనే కనిపించలేదు. కొన్ని తమిళ సినిమాలు చేసినా అంతగా కలిసి రాలేదు. అటు బాలీవుడ్‌‌లోనూ ప్రయత్నాలు సాగించినా సక్సెస్ వరించలేదు. దాంతో మళ్లీ సౌత్‌‌పై కాన్సన్‌‌ట్రేట్ చేసింది. ఇక్కడ అవకాశాలను అందుకుంటూనే దే దే ప్యార్‌‌‌‌ దే, మర్‌‌‌‌జావా వంటి హిందీ చిత్రాల్లో నటించింది. రీసెంట్‌‌గా మరో బాలీవుడ్‌‌ మూవీలో అర్జున్‌‌ కపూర్‌‌‌‌తో నటించడానికి కమిటయ్యింది. తెలుగులో నితిన్‌‌, చంద్రశేఖర్ యేలేటి చేస్తున్న చిత్రంలో హీరోయిన్‌‌గా నటిస్తోంది. తమిళంలో ‘భారతీయుడు 2’లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇలా మూడు భాషల్లోనూ నటిస్తూ మళ్లీ ఫామ్‌‌లోకి వస్తోంది. అయితే అదంతా తాను ఆచి తూచి పాత్రల్ని ఎంచుకోవడం వల్లే తప్ప అవకాశాలు లేక కాదని ఆమె చాలాసార్లు చెప్పింది. అందుకే ఇప్పటికీ అదే స్పీడులో సాగిపోతున్నాను, ఈ స్పీడ్ ఇప్పుడప్పుడే తగ్గదు అని కూడా అంటోంది.

ఈ వేగం కేవలం నటనలోనే కాదు, వ్యాపారంలోనూ చూపిస్తోంది రకుల్. ఆల్రెడీ హైదరాబాద్, వైజాగ్‌‌ నగరాల్లో ఫిట్‌‌నెస్‌‌ సెంటర్స్‌‌ పెట్టి సక్సెస్ అయ్యింది రకుల్. ఇప్పుడు బెంగళూర్‌‌‌‌కి కూడా తన వ్యాపారాన్ని విస్తరిస్తోందట. చెన్నైలో కూడా జిమ్స్ పెట్టే ఆలోచనలో ఉందట. దాని కోసం భారీగానే పెట్టుబడి పెడుతోందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవడంలో తప్పేముంది! రకుల్ అడుగులు తెలివిగానే వేస్తోంది.