హీరోగా రకుల్ బ్రదర్..సినిమా ప్రారంభం

హీరోగా రకుల్ బ్రదర్..సినిమా ప్రారంభం

హైదరాబాద్ : హీరోయిన్ రకుల్ ఫ్రీత్ సింగ్ బ్రదర్ అమన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. దాసరి లారెన్స్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీ ఆదివారం ప్రారంభం అయ్యింది.  రజనీ ఫిల్మ్ కార్పొరేషన్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో..అమన్‌ సరసన మౌనిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ కార్యక్రమాన్ని ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్‌ లో నిర్వహించారు. తొలి సన్నివేశానికి రకుల్‌ క్లాప్‌ కొట్టగా.. మంచు లక్ష్మి కెమెరా స్విచ్చాన్‌ చేసింది. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, పూర్తి వివరలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది యూనిట్. టాలీవుడ్ లో రకుల్ మంచి క్రేజ్ సంపాధించుకోగా..ఇప్పుడు తమ్ముడిని హీరోగా పరిచయం చేసింది.