చెన్నూరులో జర్నలిస్టుపై దాడిని నిరసిస్తూ ర్యాలీ

చెన్నూరులో జర్నలిస్టుపై దాడిని నిరసిస్తూ ర్యాలీ

చెన్నూరు, వెలుగు: చెన్నూరు పట్టణానికి చెందిన ప్రజాజ్యోతి పత్రిక రిపోర్టర్ కనుకుంట్ల వెంకటరాజంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు, వివిధ సంఘాలు బుధవారం ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, ఐఎఫ్​టీయూ తదితర సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు, లీడర్లు మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలపై వార్త రాసిన రిపోర్టర్ వెంకటరాజంపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. దాడి వ్యవహారంపై ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా ఎంక్వయిరీ చేయించి దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు సంఘం రాష్ట్ర నాయకుడు తీగల శ్రీనివాస్, వివిధ పార్టీల లీడర్లు మహేశ్, శ్రీనివాస్, కృష్ణ, భారతి, రమేశ్, గోపి, చందు, వెంకటేశ్వర్ గౌడ్, సతీశ్, రవి తదితరులు పాల్గొన్నారు.