Ram Charan: తిరుమల శ్రీవారి సేవలో రామ్ చరణ్ దంపతులు

Ram Charan: తిరుమల శ్రీవారి సేవలో రామ్ చరణ్ దంపతులు

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌(Ram Charan) ఆయన సతీమణి ఉపాసన(Upsana) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు (మార్చి 27) రామ్ చరణ్ 39వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తిరుమలకు వచ్చారు. బుధవారం ఉదయం వీఐపీ దర్శనంలో వెంకన్న సేవలో పాల్గొన్నారు. రామ్ చరణ్, ఉపాసనతో పాటు కూతురు క్లిన్ కార(Klin kaara) కూడా ఉన్నారు. వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి.. దర్శన అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక తిరుమలకు రామ్‌చరణ్‌ రావడంతో ఆయన చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. కియారా అద్వానీకి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి నేడు(మార్చ్ 27) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా జరగండి.. అంటూ సాగే మొదటిపాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.