Ram Charan: సైలెంట్‌గా శ్రమిస్తూ.. భారీ ఛాలెంజ్‌కు సిద్ధమైన హీరో రామ్ చరణ్.. క్రేజీ అప్డేట్!

Ram Charan: సైలెంట్‌గా శ్రమిస్తూ.. భారీ ఛాలెంజ్‌కు సిద్ధమైన హీరో రామ్ చరణ్.. క్రేజీ అప్డేట్!

‘పెద్ది’ సినిమా కోసం హీరో రామ్ చరణ్ జిమ్‌లో కఠినమైన వర్కౌట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిమ్‌లో వ్యాయామం చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. “ఫైర్ మీదున్నా.. సైలెంట్‌గా పనిచేస్తున్నా.. రెడీ ఫర్ ది నెక్స్ట్ ఛాలెంజ్” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తోంది. నిర్మాతగా వెంకట సతీష్ కిలారు వ్యవహరిస్తున్నారు. ‘పెద్ది’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. త్వరలోనే కీలకమైన ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని లెజెండరీ కంపోజర్ ఏ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.