ఆస్కార్ రాగానే ఎన్టీఆర్, చరణ్ ఏం చేశారంటే?

ఆస్కార్ రాగానే ఎన్టీఆర్, చరణ్ ఏం చేశారంటే?

నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ అనౌన్స్ చేస్తున్న టైంలో టీవీల్లో చూస్తున్నవాళ్లే కూర్చోలేకపోయారు. అలాంటిది ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిందని ప్రకటించడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఎన్టీఆర్, చరణ్ హగ్ చేసుకొని సందడి చేశారు.

వేడుకల తర్వాత మాట్లాడిన రామ్ చరణ్.. ఈ సినిమాలో పాత్రలు పోషించడం నా అదృష్టం. సిని పరిశ్రమతో పాటు మా జీవితాల్లో కూడా ఆర్ఆర్ఆర్ ప్రత్యేకమైంది. సినిమా కోసం పనిచేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు. తారక్ తో మళ్లీ డాన్స్ చేసి.. ఇలాంటి రికార్డు క్రియేట్ చేయాలని ఉందని అన్నాడు. 

తర్వాత ఎన్టీఆర్ ను మీ చొక్కాపై ఏంటది? అని ప్రశ్నించగా.. ఇది ఆర్ఆర్ఆర్ లో నేను వేటాడిన పులి అని వ్యంగ్యంగా జవాబిచ్చాడు.