
‘ఆర్ఆర్ఆర్’తో రికార్డులు క్రియేట్ చేసిన రామ్ చరణ్ ఈనెల 29న ‘ఆచార్య’లో తండ్రి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇక చరణ్ ఫోకస్ అంతా డైరెక్టర్ శంకర్ మూవీపైనే పెట్టాడు. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తిచేసేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం శంకర్ మూవీకి బ్రేక్ ఇచ్చిన చరణ్ త్వరలోనే తిరిగి సెట్స్‌లో జాయిన్ కానున్నాడు. అయితే ఈ సినిమాలో చరణ్ పాత్ర గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో చరణ్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఐఏఎస్ ఆఫీసర్‌గా, రాజకీయ నాయకుడిగా అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం స్టూడెంట్‌గా, జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఒక పాత్రలో మాత్రం కంప్లీట్ యాక్షన్ హీరోగా ఇంప్రెస్ చేయడం ఖాయమంటున్నారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రామోజీ ఫిల్మ్‌సిటీలో పదికోట్ల రూపాయల సెట్‌లో ఓ సాంగ్ షూట్ చేశారు. అలాగే ఫైట్ సీన్ కోసం మరో పది కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో చరణ్‌కి జంటగా కియారా అద్వానీ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.