గౌరవ డాక్టరేట్‌‌ను అందుకున్న రామ్ చరణ్

గౌరవ డాక్టరేట్‌‌ను అందుకున్న రామ్ చరణ్

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ లెవల్‌‌లో ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్‌‌ను అందుకున్నాడు.  చెన్నైకు చెందిన వేల్స్ యూనివ‌‌ర్సిటీ నుంచి శనివారం డాక్టరేట్‌‌ను స్వీకరించాడు. ఇప్పటికే ఈ యూనివర్సిటీ నుంచి  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌‌న్‌‌,  డైరెక్టర్ శంక‌‌ర్ డాక్టరేట్‌‌ను అందుకున్నారు. ఇప్పుడు   రామ్ చరణ్‌‌కు ఈ గౌరవం దక్కడంపై  అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్‌‌ చేంజర్‌‌‌‌’లో నటిస్తున్న చరణ్.. మరోవైపు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ నటిస్తున్నాడు.