డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్

V6 Velugu Posted on Sep 13, 2021

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడిగా, నిర్మాతగా, బిజినెస్ మెన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే పలు బిజినెస్ లు చేస్తున్న ఈయన.. ఇప్పడు మరో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ సైన్ చేసినట్లు సమాచారం. బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు రామ్ చరణ్ భారీ మొత్తం డిమాండ్ చేయగా.. అందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ అంగీకరించినట్లు తెలుస్తోంది. తమ సంస్థకు చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడంపై ఆ సంస్థ కూడా సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ డీల్ ఒక ఏడాది పాటు కొనసాగినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో చరణ్ కారణంగా తమ యాప్ కు సభ్యులుగా మారడానికి మిలియన్ల మంది చందాదారులు ఆకర్షితులవుతారని హాట్‌స్టార్ నిర్వహకులు అంచనా వేస్తున్నారు.అలాగే.. హాట్‌స్టార్ ప్రస్తుతం తెలుగు వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలతో సహా అనేక తెలుగు ఒరిజినల్స్ రూపొందించడంపై దృష్టి సారించింది.

RRR లాంటి పాన్ ఇండియా సినిమా విడుదలకు సిద్దమవుతున్న సమయంలో చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా చేర్చడంతో.. OTT వైపు ఎక్కువ మందిని ఆకర్షించడానికి వీలుంటుందని అంటున్నారు సినీ ఎక్స్ట్ ఫర్ట్స్. 

Tagged ram charan, brand ambassador, Disney+Hotstar

Latest Videos

Subscribe Now

More News