
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.సోమవారం ఉదయం నుంచే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సినిమా నటులు ఓటు వేశారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో కలిసి ఓటు వేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో రామ్ చరణ్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరికంటే ముందు మహేష్ బాబు, నమ్రత దంపతులు ఇదే పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. అయితే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగిసింది.