
మెగా ప్రిన్సెస్ క్లీంకార (Klin Kaara) పుట్టి నెల రోజులు పూర్తి కావడంతో మెగా..కామినేని ఫ్యామిలీస్ ఎంతో హ్యాపీ గా ఉన్నట్లు వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో లో ఉపాసన డెలివరీకు ముందు కలిగిన బెస్ట్ మూమెంట్స్ అన్నీటిని జోడించారు. ప్రతి ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన క్షణాలు వారి కళ్ళలో కనిపిస్తున్నాయి. హాస్పిటల్ లో చరణ్ గడిపిన క్షణాలు హత్తుకుంటున్నాయి.
క్లీంకార కు సంబంధించిన ప్రతి విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకుంటున్న విషయం తెలిసేందే. ఇప్పుడు ఈ లేటెస్ట్ వీడియోలో క్లీంకారతో మెగా ఫ్యామిలీ నెల రోజుల గడిపిన క్షణాలు కుడా వీడియో లో ఉండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చిరంజీవి మెగా ప్రిన్సెస్ క్లీంకారకు పేరు అనౌన్స్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ సందర్భంగా రామ్ చరణ్(Ram Charan) తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు.. 'క్లీంకార పుట్టే సమయంలో మా అందరిలో తెలియని టెన్షన్ మొదలైంది. అంతా సరిగ్గా జరగాలని ప్రార్ధించాం. అన్ని అనుకున్నట్లు జరగడంతో క్లీంకార ఈ లోకంలోకి అడుగు పెట్టింది. పాప పుట్టిన మరుక్షణం నా ఆనందం మాటల్లో చెప్పలేనిది. పాప పుట్టడానికి పట్టిన ఈ తొమ్మిది నెలల మాకెంతో గొప్ప క్షణాలు' అంటూ.. ఉపాసనకు బర్త్ డే విషెస్ తెలియజేశారు చెర్రీ.
ఈ మాటలు విన్న మెగా ఫ్యాన్స్ కళ్ళలో.. చరణ్ అనుభవించిన తీరు గురుంచి ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయినట్లు సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. కాగా ఉపాసన(Upasana) మాట్లాడుతూ.. 'మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాలని కోరుకున్నాం. ఆమె పేరుకు ముందు వెనుక..ఎలాంటి ట్యాగులు ఇవ్వకండి. ఇలాంటి వాటిని వారే స్వయంగా సాధించుకోవాలి. పిల్లల పెంపకంలో ఇవెంతో ముఖ్యమైనవి. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి. అందరూ సంతోషంగా ఉండే సమయానికి విలువ ఇవ్వాలి. అభిమానులు.. స్నేహితులు.. సన్నిహితు లు..కుటుంబ సబ్యులు చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞు రాలిని' అని అన్నారు.
క్లీంకార పేరు వెనుక చాలా చరిత్రే ఉంది. భారత్ లోని ఏపీ..తెలంగాణ..కర్ణాటక.. ఒడిస్సా ప్రాంతాల్లో నివసిస్తోన్న చెంచు జాతి నుంచి స్పూర్తి పొంది క్లీంకారగా నామకరణం చేసారని పేర్కోన్నారు. గొప్ప ఫ్యామిలీ లో పుట్టినందుకు..తల్లి తండ్రులు సాధించిన ఘనతను పిల్లలకు ట్యాగ్ చేయకూడదని..ఎవరి ఘనత వారే సాధించుకోవాలన్న ఉపాసన ఆలోచనను ప్రతి ఒక్కరు ప్రశంశిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంతటి ఫ్యామిలీ ఎమోషన్ ను, అందరికి కనెక్ట్ అయ్యేలా వీడియోను డైరెక్ట్ చేసింది జోసెఫ్ ప్రతినిక్.