Ram Charan: రామ్‌చరణ్ న్యూ లుక్ అదిరిపోయిందిగా

Ram Charan: రామ్‌చరణ్ న్యూ లుక్ అదిరిపోయిందిగా

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. సరికొత్త హెయిర్ స్టైల్‌లో చెర్రీ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో కనిపిస్తున్నాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ చెర్రీతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘మా సూపర్ డూపర్ హీరో మరోక కొత్త అవతారంలో కనిపించడానికి సిద్ధంగా ఉన్నాడు’ అని క్యాప్షన్ పెట్టాడు. అయితే, ఈ లుక్ శంకర్ దర్శకత్వంలో రాబోతోన్న ఆర్‌‌సీ15 కోసమే అని తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజాగా చార్మినార్ దగ్గర తీసిన షూటింగ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ విశాఖలో జరుగుతుంది.