పవన్ మాటలు తీవ్రవాదం కంటే ప్రమాదకరం : రామ్ గోపాల్ వర్మ

పవన్ మాటలు తీవ్రవాదం కంటే ప్రమాదకరం : రామ్ గోపాల్ వర్మ

వారాహి యాత్రలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్స్ పై రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో స్పందించాడు. పవన్ చేస్తున్న కామెంట్స్ కు స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా వరుస కౌంటర్లు వేశాడు.

 “చివరికి రాజకీయ క్యాంపైన్లు ఇక్కడికి చేరాయి.. తాను అనుకున్నదాన్ని ఎవరు వ్యతిరేకించినా.. అధికారం లో కొస్తే పీక పిసికేసి చంపేస్తా, బట్టలూడదీసి పరిగెత్తిస్తా,చర్మం వొలిచేస్తా లాంటి హింసాత్మికమైన బెదిరింపులు ప్రపంచ చరిత్రలో ఎవరు చేసుండరు. హిట్లర్, సద్దాం, కిం జొంగ్ ఉన్ తో సహా ఎవరూ అనుండరు. ఇంకో విషయమేంటంటే అధికారం లోకి వస్తే నరికేస్తాను అంటే.. ఇప్పుడు అధికారంలో వున్న పార్టీ అది చేయచ్చు అని చెప్పడమా ? ఏది ఏమైనా ఒక ప్రజాస్వామ్య దేశంలో తన ఫాలోయర్స్ కి డైరెక్ట్ గా ఇంత బ్రూటల్ వయోలెన్స్ ని ప్రభోదించడం తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం. ఇలాంటి హింస ని ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ ఉంటే ఆ మీటింగ్లకొచ్చ్చే యువకులను భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడో పవన్ కళ్యాణ్ కే తెలియాలి. పైగా ఈ వయోలేంట్ బెదిరింపులన్ని లైవ్ లో ప్రజలందరూ, లివింగ్ రూమ్స్ లో పిల్లలతో చూస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక వర్మ చేసిన ఈ ట్వీట్ పై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. నువ్వు ఇలా ట్వీట్ చేస్తుంటే.. ప్రతివ్రత పరమాన్నం లాంటి మాటలు గుర్తుకు వస్తున్నాయి. నువ్వెంటి వర్మ సడెన్ గా గౌతమ బుద్దలా మారిపోయావు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

చివరికి రాజకీయ క్యాంపైన్లు ఇక్కడికి చేరాయి.. తననుకున్నదాన్ని ఎవరు వ్యతిరేకించినా అధికారం లో కొస్తే పీక పిసికేసి చంపేస్తా , బట్టలూడదీసి పరిగెత్తిస్తా ,చర్మం వొలిచేస్తా , లాంటి హింసాత్మికమైన బెదిరింపులు ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో ఎవరూ అనుండరు హిట్లర్, సద్దాం, కిం జొంగ్…

— Ram Gopal Varma (@RGVzoomin) June 23, 2023