RGV Tweet: హే విద్యుత్ గ్రీకుదేవుడిలా కనిపిస్తున్నావ్..నీకు మిలియన్ సెల్యూట్స్

RGV Tweet: హే విద్యుత్ గ్రీకుదేవుడిలా కనిపిస్తున్నావ్..నీకు మిలియన్ సెల్యూట్స్

బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్(Vidyut Jammwal) గురించి పెద్ద‌గా ప‌రిచయం అక్క‌ర్లేదు. శక్తి, ఊసరవెల్లి, తుపాకి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు దగ్గరయ్యాడు. ఇవాళ (డిసెంబర్ 10) విద్యుత్ జమ్వాల్ పుట్టినరోజు సందర్బంగా హిమ‌ల‌యాలకు వెళ్లగా..ఒంటిపై బట్టలు లేకుండా న‌గ్నంగా తిరుగుతూ కనిపించారు. ఇందుకు సంబందించిన ఫోటోలను విద్యుత్ జమ్వాల్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో క్షణాల్లో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. 

లేటెస్ట్ గా వైరల్ అవుతోన్న జమ్వాల్ ఫొటోస్ పై రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తనదైన శైలిలో ట్వీట్ చేశారు. హే విద్యుత్..నీలోని నిజమైన యానిమల్ ను సరైన సమయంలో బయటపెట్టావ్..నువ్వు నాకు గ్రీకుదేవుడిలా కనిపిస్తున్నావ్..నీ సాహసానికి మిలియన్ సెల్యూట్స్..అంటూ RGV తెలిపారు. 

విద్యుత్ జమ్వాల్ పేరుకు పెద్ద నటుడే అయినా..ఎటువంటి అర‌మరికలు లేకుండా అందరితో కలిసిపోయే విలక్షణ స్వభావం ఇత‌డిది. అతని సోషల్‌ మీడియాలో విద్యుత్‌ ఫాలోవర్స్‌ సంఖ్య మిలియన్లలో ఉంటుంది. బట్టలు లేకుండా సాధువులా సేదదీరుతున్నా జమాల్ కు అన్నిటికన్నా తనను తాను అన్వేషించుకోవడమే అసలైన తృప్తిని ఇస్తుందని ట్విట్ట‌ర్ వేదిక‌గా రాసుకోచ్చాడు.