
ఒకప్పుడు ‘భూత్’ లాంటి హారర్ థ్రిల్లర్స్‌తో భయపెట్టిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా జానర్ మార్చారు. ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ పేరుతో ఆయన ఓ హారర్ కామెడీ సినిమా చేస్తున్నారు. ‘యూ కాంట్ అరెస్ట్ ది డెడ్’ అనేది క్యాప్షన్. బాలీవుడ్‌లో పవర్‌హౌస్ ఫెర్ఫార్మర్‌గా పేరుగాంచిన మనోజ్ బాజ్‌పాయ్ ఇందులో లీడ్ రోల్ చేస్తున్నారు. జెనీలియా కీలకపాత్ర పోషిస్తోంది.
సోమవారం మోషన్ పోస్టర్‌తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఓ భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌ను పోలీస్ ఆఫీసర్ ఎన్‌కౌంటర్ చేయగా, రివేంజ్ తీర్చుకోవడానికి అతను దెయ్యంలా తిరిగొస్తే ఏం జరిగింది అనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అని వర్మ తెలియజేశారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’ చిత్రంతో బికూ మాత్రేగా మనోజ్ బాజ్‌పాయ్ క్యారెక్టర్‌కు, తన నటనకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.
ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత తిరిగి వర్మతో కలిసి వర్క్ చేయడం పట్ల మనోజ్ సంతోషం వ్యక్తం చేశాడు. ల్యాంగ్ గ్యాప్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడం, వర్మ ఈసారి హారర్ కామెడీని ప్రయత్నిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.