"స్కంద"గా రామ్ పోతినేని.. బోయపాటి మాస్ ఫీస్ట్ పక్కా

"స్కంద"గా రామ్ పోతినేని.. బోయపాటి మాస్ ఫీస్ట్ పక్కా

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వస్తున్న సినిమాకు "స్కంద" అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ  గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రామ్.. కత్తి పట్టుకొని శత్రువులను నరుకుతూ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. 

ఇక ఈ వీడియోలో రామ్ చెప్పిన.. "మీరు దిగితే ఊడేదుండదు.. నేను దిగితే మిగిలేదుండదూ" అనే డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా కూడా బోయపాటి మార్క్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని ఈ వీడియో చూస్తేనే తెలుస్తోందని. ఇక అఖండ వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి నుండి వస్తున్న సినిమా కావడంతో స్కంద పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటివరకు రీజనల్ మూవీస్ చేసిన బోయపాటి.. మొదటిసారి పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు.  

టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా.. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.