సీతారాముల ప్రేమ కావ్యం.. ఆదిపురుష్ నుండి మరో సాంగ్

సీతారాముల ప్రేమ కావ్యం.. ఆదిపురుష్ నుండి మరో సాంగ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీతగా రానున్న వస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం గాధ ఆధారంగా వస్తున్న ఈ మైథిలాజికల్ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో వేగం పెంచేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్,టీజర్, ట్రైలర్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి.

ఇక ఇటీవల జై శ్రీరామ్ అనే సాంగ్ ని రిలీజ్ చేయగా అది కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక తాజాగా ఈ మూవీలోని రామ్ సియా రామ్ అనే పాటని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పాట కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో నా రాఘవుడు ఎక్కడ ఉంటే అదే ణా ప్రపంచం, మీ నీడైన మిమ్మల్ని వదిలేయోచేమో కానీ ఈ జానకి మాత్రం మిమ్మల్ని వదిలి ఉండలేదు అని జానకి పాత్రలో కృతి చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి.

జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 6న నిర్వహించబోతున్నారు మేకర్స్. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

https://www.youtube.com/watch?v=zAh0s2RvIQs