
అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ఆగస్టు మొదటి వారంలో భూమి పూజ చేయనున్నారు. ఆగస్టు 5వ తేదీన ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరుకానున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మొదటిసారి అధికారికంగా శనివారం భేటీ అయింది. కాగా.. ఆ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. భూమి పూజ జరిగే రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు ప్రధాని అయోధ్యలోనే ఉంటారని, ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్లొంటారని తెలుస్తోంది. వారణాసికి చెందిన పూజార్ల ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. భూమి పూజ చేసిన రోజే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు.