రామగుండం ఆర్ఎఫ్ సీఎల్ డీజీఎం కరోనాతో మృతి

రామగుండం ఆర్ఎఫ్ సీఎల్ డీజీఎం కరోనాతో మృతి
  • యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన 

పెద్దపల్లి జిల్లా: రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ (ఆర్ ఎఫ్ సి ఎల్)లో సివిల్ డిప్యూటీ మేనేజర్ రవిశంకర్ ప్రసాద్ కరోనా తో మృతి చెందాడు. విపరీతమైన పని ఒత్తడితోపాటు.. విధుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని తీసుకుని సంస్థ కార్యాలయం ఆవరణలోనే బైఠాయించి నిరసన చేపట్టారు. కరోనా మృతదేహంతో ఆందోళనకు దిగిన ఉదంతం సంచలనం రేపింది.  తమ కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయామంటూ కుటుంబ సభ్యులు కంటతడిపెట్టుకుని విలపించారు. రవిశంకర్ ప్రసాద్ మృతి పట్ల సాటి ఉద్యోగులు స్పందించి సంఘీభావం తెలిపారు. కరోనా మృతదేహంతో నిరసన తెలుపుతున్న కుటుంబ సభ్యులకు మద్దతు ప్రకటించారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని తోటి అధికారులు డిమాండ్ చేశారు.