జై బాలయ్య సాంగ్...రామజోగయ్య శాస్త్రి ట్వీట్ వైరల్

జై బాలయ్య సాంగ్...రామజోగయ్య శాస్త్రి ట్వీట్ వైరల్

ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను..దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు.. అన్నట్టు...జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి అంటూ దండం పెట్టేస్తోన్న ఎమోజీలను షేర్ చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డిలోని జై బాలయ్య సాంగ్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే ఆయన ఈ ట్వీట్ చేశారు.

 

ఇక జై బాలయ్య సాంగ్ రిలీజైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే.. ఈ సాంగ్ పై నందమూరి, మెగా అభిమానుల మధ్య  సోషల్ మీడియాలో వార్  నడుస్తోంది. ఈ పాటలోని లిరిక్స్‭ను మెగా ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకున్నారు. పాటలోని లిరిక్స్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసేలా ఉన్నాయంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి మీద అభిమానులు మండిపడుతున్నారు. అయితే... ఈ పాట విడుదల అయ్యాక సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్స్‭కు స్పందిస్తూ.. రామజోగయ్య శాస్త్రి ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. 

మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ 107వ సినిమాగా వీరసింహారెడ్డి మూవీ రూపొందుతోంది. ఎప్పుడైతే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారో అప్పటినుంచే నందమూరి ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. అయితే.. వీరసింహారెడ్డి సినిమా నుంచి రిలీజైన జై బాలయ్య లిరిక్స్ వైరల్ అవుతున్నారు. మెగా అభిమానులు, బాలయ్య అభిమానుల మధ్య వివాదానికి దారి తీశాయి.