మంచిర్యాలలో రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రి భేష్.. రాష్ట్రంలోనే మొదటి స్థానం

మంచిర్యాలలో రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రి భేష్.. రాష్ట్రంలోనే మొదటి స్థానం
  •     హెల్త్ కేర్, పరిశుభ్రత, ఎకో ఫ్రెండ్లీ విభాగాల పనితీరులో పురస్కారం

కోల్​బెల్ట్, వెలుగు: హెల్త్ కేర్, పరిశుభ్రత, ఎకో ఫ్రెండ్లీ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనుబర్చిన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​సింగరేణి ఏరియా ఆస్పత్రి ఉత్తమంగా  నిలిచింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించింది. 

హైదారాబాద్​సనత్​నగర్​లోని పొల్యూషన్​ కంట్రోల్​బోర్డు ఆఫీస్​లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఏరియా హాస్పిటల్​ డీవైసీఎంవో(అడ్మిన్) డాక్టర్​ ఎం.మధుకుమార్ పురస్కారాన్ని అందుకున్నారు. హెల్త్ కేర్, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, హరిత కార్యక్రమాలు, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణ, ఆస్పత్రి పరిసరాల అభివృద్ధి, పర్యావరణహిత చర్యలను సమర్థవంతంగా అమలు చేసినందుకు ఈ అవార్డు లభించిందని డీవైసీఎంవో హర్షం వ్యక్తం చేశారు.