రమణి కళ్యాణం టైటిల్ గ్లిమ్ప్స్ రిలీజ్..

రమణి కళ్యాణం టైటిల్ గ్లిమ్ప్స్ రిలీజ్..

దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘రమణి కళ్యాణం’. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘కోర్ట్’ దర్శకుడు రామ్ జగదీష్ ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. శుక్రవారం  మూవీ టైటిల్‌‌‌‌ను అధికారికంగా ప్రకటించారు.  

కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి వంటి ప్రముఖులు టైటిల్‌‌‌‌ను లాంచ్ చేసి బెస్ట్ విషెస్‌‌‌‌ తెలియజేశారు. 

జీవితంలోని సవాళ్ల మధ్య ప్రేమ, విలువలు, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో సాగే అందమైన ప్రయాణంగా ఈ చిత్రం ఉండబోతోందని మేకర్స్‌‌‌‌ ఈ సందర్భంగా తెలియజేశారు. విలువలతో కూడిన కథను నిజాయితీగా, వినోదాత్మకంగా తెరకెక్కించామని అన్నారు.  సూరజ్ ఎస్ కురుప్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.