‘రామప్ప’ అద్భుతం: త్రిపుర ఈఆర్ సీ చైర్మన్ హేమంత్ వర్మ

‘రామప్ప’ అద్భుతం: త్రిపుర ఈఆర్ సీ చైర్మన్ హేమంత్ వర్మ

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఈఆర్ సీ) చైర్మన్ హేమంత్ వర్మ దంపతులు శనివారం సందర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం రామప్ప టెంపుల్, లక్నవరం లేక్ లో పర్యటించారు. గైడ్ ద్వారా రామప్ప చరిత్ర విశిష్టతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ   కాకతీయుల కళా నైపుణ్యానికి అద్దం పట్టినట్లు ఉందని, రామప్ప చరిత్ర భవిష్యత్ తరాలకు ఎన్నో అంశాలు తెలియజేస్తుందని కితాబు ఇచ్చారు. రామప్ప టెంపుల్ సందర్శించడం చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు.