ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫ్రీ ఈవెంట్స్ కోచింగ్

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫ్రీ ఈవెంట్స్ కోచింగ్

ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ దగ్గర పడుతున్నాయి. జాబ్ రావాలంటే ఈవెంట్స్ కొట్టాల్సిందే. అయితే ప్రైవేట్ ఇన్ స్టిట్యూట్స్ కు ఫీజులు కట్టలేని వారికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు ఓ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఆఫీసర్. జీఎస్ఐ లో ఎగ్జిగ్యుటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కె. రామర్ హరిన వనస్థలి నేషనల్ పార్క్ లో  జాగింగ్ కు వస్తుంటారు. ట్రైనింగ్ పై మంచి పట్టు ఉన్న వ్యక్తి ఇండియన్ సైక్లింగ్,రన్నింగ్ లో మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తి ఇదే పార్క్ లోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్న ఎస్సై,కానిస్టేబుల్ అభ్యర్థులను చూస్తూ ఉండే వాడు. అభ్యర్థులకు అండగా నిలిచి ప్రాక్టీస్ చేయిస్తున్న ప్రస్తుత రాచకొండ కమిషనరేట్ లో పనిచేస్తున్న లక్ష్మణ్ అనే హోమ్ గార్డ్ రామర్ ను పిలిచి అభ్యర్థులకు ట్రైన్ చేయాలని అడిగారు.దీంతో అప్పటికే వారిని ట్రైన్ చేయాలని డిసైడ్ అయిన రామర్ వారికి కోచింగ్ ఇస్తున్నాడు. 

మొదట 10మందితో ప్రారంభం అయిన ఈ బ్యాచ్ ప్రస్తుతం 70 మందికి శిక్షణ ఇస్తున్నారు.దీనికి తోడు రాచకొండ సీపీ ఆఫీస్ లోపనిచేస్తున్న ప్రమోద్ అనే ఎస్సై తో పాటు కొంత మంది కానిస్టేబుల్స్ కూడా అభ్యర్థులకు సలహాలు సూచనలు చేస్తున్నారు. అయితే తాము ట్రైన్ చేసిన అభ్యర్థులు ఈవెంట్స్ లో క్వాలిఫై అవ్వడం కాదు మెరిట్ కోసం ప్రయత్నం చేస్తున్నామని రామర్ చెబుతున్నారు.క్యాలిపై స్టేజ్ వారు ఎప్పుడో క్రాస్ చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఇలా అభ్యర్థులను ఈవెంట్స్ కు సిద్ధం చేయడం సంతోషంగా ఉందని తాను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు తెలిపారు. అయితే లక్ష్మణ్ హోమ్ గార్డ్ అయినప్పటికీ ఇప్పటి వరకు తన కాలనీలో 9మందిని డిపార్ట్మెంట్ లో జాబ్ కొట్టించాడు. అందులో ఇద్దరు ఎస్సైలు ఉండగా మిగతా వారు కానిస్టేబుల్స్. ప్రస్తుతం కూడా 10 నుండి 20 మందిని తయారు చేస్తున్నారు.