నేపాల్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌గా  రామ్‌‌‌‌చంద్ర పౌడెల్

నేపాల్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌గా  రామ్‌‌‌‌చంద్ర పౌడెల్

కాఠ్మండు: నేపాల్ ప్రెసిడెంట్‌‌‌‌గా రామ్‌‌‌‌చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. తనపై పోటీ చేసిన సుబాస్ చంద్ర నెబ్‌‌‌‌మాంగ్ పై గెలిచారు. నేపాలీ కాంగ్రెస్, ప్రధాని పుష్ప కమాల్ దహాల్ ప్రచండ ఆధ్వర్యంలోని సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్) సహా 8 పార్టీల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పౌడెల్ పోటీ చేశారు. మొత్తం 882 ఓట్లలో 831 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 566 ఓట్లు పౌడెల్‌‌‌‌కు పడినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రస్తుత ప్రెసిడెంట్ బిద్యా దేవి భండారి పదవీ కాలం ఈనెల 12తో ముగియనుంది.