
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తవగా, కీలకమైన లెంగ్తీ షెడ్యూల్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం చరణ్ బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. తన పాత్ర కోసం నెవర్ బిఫోర్ అవతార్‌లోకి మారాడు. పవర్‌ఫుల్ లుక్‌కి ఫిట్ అవడానికి ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యాడు. కంటిన్యూగా కసరత్తులు చేస్తూ, డెడికేషన్‌తో ఫిజిక్‌ను సాలిడ్ గా తీర్చిదిద్దుకున్నాడు. షూటింగ్ అప్‌డేట్‌తోపాటు చరణ్ జిమ్‌లో ఉన్న ఫొటోను ఈ సందర్భంగా రిలీజ్ చేశారు.
రగ్డ్ గెటప్‌లో, ముడివేసిన జుట్టు, కండలు తిరిగి ఉన్న స్ట్రాంగ్ బాడీతో కంప్లీట్ బీస్ట్ మోడ్‌లోకి మారిపోయిన చరణ్ లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది.