
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్(Game changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ మూవీ టీమ్ మైసూర్లో పలు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
లేటెస్ట్గా హీరో రామ్ చరణ్ మైసూర్ లోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు చివర దశలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో.. అభిమానుల్లో గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాను ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా శంకర్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా..ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
A glimpse of the divine moments when Global ? @AlwaysRamCharan paid a visit to the Chamundeshwari temple and offered his prayers in Mysore ✨#RamCharan #GlobalStarRamCharan #GameChanger #RC16 pic.twitter.com/qehuYFaXBa
— BA Raju's Team (@baraju_SuperHit) December 4, 2023