చంద్రయాన్ 3 సక్సెస్​తో సంపన్నుడైన రమేశ్ కున్హికన్నన్

చంద్రయాన్ 3 సక్సెస్​తో సంపన్నుడైన రమేశ్ కున్హికన్నన్
  •      ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కేన్స్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు
  •     చంద్రయాన్​ కోసం ఇస్రోకు ఎలక్ట్రానిక్స్ సప్లై చేసిన సంస్థ
  •     ప్రయోగం సక్సెస్ అవడతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, పెరిగిన బిజినెస్​

న్యూఢిల్లీ: ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2024లో ఇండియాకు చెందిన రమేశ్ కున్హికన్నన్ స్థానం సంపాదించారు. 1.2 బిలియన్ల నెట్​వర్త్​తో ఆయన ఎలాన్ మస్క్, ముఖేశ్ అంబానీ, జెఫ్ బెజోస్, అదానీ లాంటి ప్రపంచ సంపన్నుల సరసన చేరారు. చంద్రయాన్- 3తో గతేడాది ఇండియా సాధించిన అంతరిక్ష విజయం.. కున్హికన్నన్ ను బిలియనీర్​ను చేసింది. ఈ చంద్రయాన్ ప్రయోగం కోసం కున్హికన్నన్ ఎలక్ట్రానిక్స్ సప్లై చేశారు. ఈయన స్థాపించిన కేన్స్ టెక్నాలజీస్ ఇస్రోకు ఎలక్ట్రానిక్స్ సరఫరా చేసేంది.

 చంద్రయాన్​ 3లో అత్యంత కీలకమైన రోవర్, ల్యాండర్.. రెండింటికీ పవర్ అందించడానికి అవసరమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లను కేన్స్​సంస్థ సరఫరా చేసింది. చంద్రయాన్​ 3 ప్రయోగం సక్సెస్​తో ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. షేర్ విలువ భారీగా పెరింగింది. అలాగే బిజినెస్ కూడా విస్తరించింది. మైసూర్ ఎన్​ఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివిన కున్హికన్నన్ 1988లో కేన్స్ టెక్నాలజీస్ స్థాపించారు. 

సంస్థ ఎండీగా కొనసాగుతున్నారు. ఆయన భార్య సవిత రమేశ్ ప్రస్తుతం కంపెనీ చైర్​పర్సన్ గా ఉన్నారు. కేన్స్ టెక్నాలజీలో రమేశ్ కున్హికన్నన్‌కు 64 శాతం వాటా ఉంది. ఈ సంస్థ 2022 నవంబర్ లో స్టాక్ మార్కెట్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి దాని షేర్​విలువ మూడు రెట్లు పెరిగింది. దీంతో కున్హికన్నన్ నెట్​వర్త్ విపరీతంగా పెరిగి ఫోర్బ్స్ బిలియనీర్ల లిస్ట్​లో చేరారు.