వ్యూహం జగన్ బయోపిక్ కాదు: రాంగోపాల్ వర్మ

వ్యూహం జగన్ బయోపిక్ కాదు: రాంగోపాల్ వర్మ

 

‘వ్యూహం’వైయస్ రాజశేఖర్ రెడ్డి లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘వ్యూహం’. దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. జగన్ పాత్రలో అజ్మల్ నటిస్తుండగా, వైఎస్ భారతిగా మానస నటిస్తోంది. నవంబర్ 10న సినిమా విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. 

ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ నేను డైరెక్ట్ చేసే సినిమాలన్నింటిలో 80 శాతం ఏదో ఒక సంఘటన స్ఫూర్తితోనే రూపొందిస్తాను. ఈ కథలో వైఎస్ మృతి నుంచి నేటి వరకు జరిగిన ముఖ్య సంఘటనలు ఉంటాయి.  అయితే అవి ప్రజలందరికీ తెలిసిన విషయాలు కాకుండా ఇన్ సైడ్ జరిగినవి చూపిస్తున్నాం. కొందరు ముఖ్యవ్యక్తుల దగ్గర సేకరించిన సమాచారాల ఆధారంగా  ప్రేక్షకులకు నచ్చే ఒక సినిమాటిక్ ఫార్మేట్‌‌‌‌లో దీన్ని రూపొందించాం’ అన్నారు. దాసరి కిరణ్ మాట్లాడుతూ ‘ప్రజలకు తెలియని ఎన్నో గొప్ప  విషయాలు ఇందులో ఉన్నాయి. ఇది జగన్ బయోపిక్ కాదు. ఆయన రాజకీయ జీవితంలో జరిగిన సంఘటనలు చూపిస్తున్నాం’ అన్నారు.