శారీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌‌ రిలీజ్

శారీ  మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌‌ రిలీజ్

ఆమధ్య చీర‌‌క‌‌ట్టులో ఉన్న ఓ అమ్మాయి వీడియోను సోషల్ మీడియాలో చూసి ఫిదా అయ్యాడు రామ్ గోపాల్ వర్మ. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే చెప్పమంటూ పోస్టులు పెట్టాడు. దాంతో ఆమె ఆచూకీ తెలిసింది. కేరళకు చెందిన తన పేరు శ్రీలక్ష్మీ సతీష్. ఆమెను చూశాక చీరపై ఇష్టం పెరిగిందని, తనను హీరోయిన్‌‌గా పెట్టి ఓ సినిమా తీస్తానని వర్మ ప్రకటించాడు. చెప్పినట్టుగానే ‘శారీ’ పేరుతో సినిమా నిర్మిస్తున్నాడు. ‘టూ మచ్ లవ్, కెన్ బి టూ డేంజరస్‌‌’ అనేది క్యాప్షన్. 

శ్రీలక్ష్మీ సతీష్ ఫొటోస్, వీడియోస్‌‌ను అంత అందంగా తీసిన కెమెరామెన్‌‌ అఘోష్‌‌ వైష్ణవమ్‌‌ను ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు వర్మ. ఇంటర్నేషనల్ శారీ డే సందర్భంగా గురువారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌‌ను రిలీజ్ చేశారు. స్టాకింగ్ సిండ్రోమ్ నేపథ్యంలో సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌ జానర్‌‌‌‌లో ఈ సినిమా ఉంటుందని వర్మ చెప్పాడు. స్త్రీల‌‌పై పురుషుడికి ఉండే విపరీతమైన వ్యామోహం చాలా ప్రమాదాల‌‌కు కారణం అనేది ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్‌‌. ఇక శ్రీలక్ష్మీ సతీష్‌‌ పేరును ఆరాధ్య దేవి అనే స్క్రీన్‌‌ నేమ్‌‌గా మారుస్తున్నట్టు వర్మ తెలియజేశాడు.