నోటీస్ ఇవ్వకుండానే కవితను బయటకు పంపారు : కవిత మామ రాంకిషన్ రావు

నోటీస్ ఇవ్వకుండానే  కవితను బయటకు పంపారు :   కవిత మామ రాంకిషన్ రావు
  •     కవిత మామ రాంకిషన్ రావు

నవీపేట్, వెలుగు: ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కుట్ర చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను బయటకు పంపారని ఆమె మామ రాంకిషన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత సొంత మండలమైన నిజామాబాద్​జిల్లా నవీపేట్ లో టీఆర్ ఎస్ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైన టీఆర్ఎస్.. ఆ తర్వాత బీఆర్ ఎస్ అని పేరు మార్చుకున్నప్పుడే కేసీఆర్ కు తెలియకుండా కొందరు గుంట నక్కలు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. 

మేధావుల సలహా తీసుకొని తెలంగాణ రక్షణ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సహకారంతో కవిత టీఆర్​ఎస్​ను ఏర్పాటు చేశారని తెలిపారు. నేతలు వరలక్ష్మి, లక్ష్మి నారాయణ భరద్వాజ్, అవంతిరావు, సర్పంచ్ తెలంగాణ శంకర్, సొసైటీ వైస్ చైర్మన్ ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ జనార్దన్, అంజలి తదితరులు పాల్గొన్నారు.