రామమందిరం నిర్మాణం షురూ

రామమందిరం నిర్మాణం షురూ
  • ప్రకటించిన ట్రస్ట్‌ చైర్మన్‌ గోపాల్‌దాస్‌

అయోధ్య: ఉత్తర్‌‌ప్రదేశ్‌ అయోధ్యలోని రామజన్మభూమిలో మందిర నిర్మాణం షురూ అయింది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఛైర్మన్‌ మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ మంగళవారం పూజ చేసిన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. నిర్మాణం కారణంగా రామ్‌లల్లా విగ్రహాలను అయోధ్యలోని మానస్‌భవన్‌కు తరలించారు. పల్లకిలో ఊరేగిస్తూ విగ్రహాలను అక్కడకు చేర్చారు. రాముల వారి విగ్రహాలను దాదాపు 27 ఏండ్ల తర్వాత కదిలించారని స్థానికులు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్‌, తదితరులు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌, కరోనా ఎఫెక్ట్‌ ఉన్నప్పటికీ రామమందిరం నిర్మాణానికి విరాళాలు రావడం ఆగలేదని అధికారులు చెప్పారు. కేవలం ఈ లాక్‌డౌన్‌ టైంలోనే దాదాపు 4.60 కోట్ల విరాళాలు వచ్చినట్లు చెప్పారు.