బాహుబలి కోసం రాజమౌళి రూ.420 కోట్లు అప్పు చేశారు : రాణా

బాహుబలి కోసం రాజమౌళి రూ.420 కోట్లు అప్పు చేశారు : రాణా

బాహుబలి సినిమా కోసం 420 కోట్లు అప్పు చేశానని చెప్పి అందరికీ షాకిచ్చాడు రానా దగ్గుబాటి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రానా.. సినిమా మేకింగ్ కోసం నిర్మాతలు చేసే అప్పులు, వాటి కోసం వాళ్ళు చెల్లించే అదిక వడ్డీల గురించి మాట్లాడాడు. " సినిమా చేయడం కోసం నిర్మాతలు అధిక వడ్డీలకు అప్పులు తెస్తారు. నాలుగేళ్ళ క్రితం పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటే రెండే ఆప్షన్స్ ఉండేవి. ఒకటి ఆస్తులను తాకట్టు పెట్టాలి, లేదా ఎక్కువ రేట్ కు అప్పులు తీసుకోవాలి.

బాహుబలి సినిమా కోసం మేము దాదాపు రూ. 400 కోట్ల అప్పు తీసుకున్నాం. ఇందుకోసం 24- నుండి 28 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. నిజానికి ఇది చాలా ఎక్కువ. ఆ సమయంలో నిర్మాతలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. బాహుబలి సినిమా వర్క్ అవుట్ అయ్యింది కాబట్టి ఆ డబ్బు తిరిగి చెల్లించగలిగాం. ఒకవేళ ఫెయిల్ అయ్యుంటే ఎలా అనేది ఊహించుకోవడానికే భయంగా ఉంది. 

ఆ సమయంలో మాకు ఉన్న ఒకే ఒక నమ్మకం రాజమౌళి. ఆయనపైన ఉన్న నమ్మకంతోమే మేమందరం ముందుకు వెళ్లాం. అంటూ చెప్పుకొచ్చాడు రానా. ప్రస్తుతం రానా చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనియ్యాంశం అయ్యాయి.