
ప్రభాస్(Pabhas) ‘ప్రాజెక్ట్ కె’(Project- k)పై హీరో దగ్గుబాటి రానా(Rana daggubati) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బాహుబలి(Bahubali), ఆర్ఆర్ఆర్(RRR) రికార్డులు ఈ సినిమాతో బ్రేక్ అవ్వనున్నాయంటూ భారీ హైప్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాని తెలిపాడు.
ఈ టాలీవుడ్ మూవీకి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు రావడం ఖాయమని అన్నాడు. దీంతో రెబల్ స్టార్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. రానా కామెంట్స్‌తో ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు డబులవుతున్నాయి. ఈ సంక్రాంతి కానుకగా ప్రాజెక్ట్ కె విడుదల కానుంది. నాగ్ అశ్విన్(Nag ashwin) డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) నటిస్తున్నాడు. కమల్ హాసన్(Kamal haasan) సైతం కీలక రోల్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.