"రానా నాయుడు"..డిఫ్రెంట్ లుక్స్లో వెంకీ

"రానా నాయుడు"..డిఫ్రెంట్ లుక్స్లో వెంకీ

దగ్గుబాటి బాబాయ్..అబ్బాయ్..తొలిసారి కలిసి నటిస్తున్నారు. గతంలో ఓ సినిమాలో ప్రత్యేక గీతంలో కనిపించి అలరించిన వీరిద్దరు.. మొదటి సారిగా వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నారు. నెట్ ఫ్లిక్స్ కోసం  రూపొందుతున్న "రానా నాయుడు" అనే వెబ్ సిరీస్లో బాబాయ్ విక్టరీ వెంకటేష్, అబ్బాయి రానా ఫుల్ లెగ్త్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన రానా, వెంకటేష్‌ పోస్టర్లు భారీ అంచనాలు క్రియేట్‌ చేశాయి. తాజాగా రానా నాయుడు టీజర్‌ విడుదల అయింది.


 
వెంకీ చేతికి సంకెళ్లు..
సాయం కావాలా  అనే డైలాగ్తో మొదలయ్యే టీజర్ ..ఇంట్రస్ట్ను క్రియేట్ చేస్తోంది.  రానా గ్యాంగ్ స్టర్ పాత్రలో అదరగొట్టగా... వెంకటేష్ డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నారు. జైల్లో సంకెళ్లు, తెల్లని గడ్డంతో వెంకీ కనిపించారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో తండ్రీ కొడుకులుగా వెంకీ రానా నటిస్తున్నట్లు టీజర్ను చూస్తుంటే అర్థమవుతుంది. తండ్రి మీద ద్వేషంతో ఉన్న కొడుకు పాత్రలో రానా నటించారు. అంతేకాదు..తండ్రి వెంకటేష్ తలకి రానా గన్ గురి పెట్టిన సీన్ ఆసక్తిని పెంచుతోంది. ఈ సమయంలో నేను మీ నాన్నను అని వెంకటేష్ అంటే..నువ్వేమైనా మంచి పనులు చేశావా..నాన్న అని పిలిపించుకోవడానికి అంటూ రానా అంటాడు. మొత్తంగా థ్రిల్లర్ ఎలిమెంట్‌తో  బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్  రానా నెట్‌ప్లిక్స్‌లో సందడి చేయనున్నట్లు టీజర్ను చూస్తే తెలుస్తోంది.

పాపులర్ అమెరికన్ సిరీస్ 'రే డోనోవర్' కు ఇండియన్ అడాప్షన్ వెర్షన్ "రానా నాయుడు" వెబ్ సిరీస్. మన నెటీవీటికి తగినట్టు  కొన్ని మార్పులు చేసి దీన్ని రూపొందించారు.  క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్లో ముకుల్ చద్దా కీలక పాత్ర పోషించారు. మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ను తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో..త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫ్యాన్స్కు పండగే..
విక్టరీ వెంకటేష్  ఈ ఏడాది ‘ఎఫ్ 3’ మూవీతో  సక్సెస్ అందుకుని జోరు మీదున్నారు. ప్రస్తుతం వెంకటేష్  సల్మాన్‌ ఖాన్‌తో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా చేస్తున్నారు. అటు విశ్వక్‌సేన్‌తో కలిసి ‘ఓరి దేవుడా’ సినిమా కూడా చేస్తున్నారు. అటు  రానా  పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’ సినిమాతో సందడి చేశారు. ఆ తర్వాత ‘విరాట పర్వం’ సినిమాతో పలకరించారు. మొత్తానికి బాబాయ్, అబ్బాయ్ తొలిసారి కలిసి నటిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకి వీరిద్దరూ కలిసి ఏ సినిమా కూడా చెయ్యలేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ ద్వారా ఫ్యాన్స్ కోరిక నెరవేరబోతుంది.