
రణ్‌బీర్ కపూర్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న చిత్రం ‘యానిమల్’. రష్మిక మందన్న హీరోయిన్. ఆగస్టు 11న వరల్డ్‌వైడ్‌గా సినిమా రిలీజ్ చేయనున్నట్టు రీసెంట్‌గా అనౌన్స్ చేసిన టీమ్.. ఆదివారం ప్రీ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో రణ్‌బీర్ గొడ్డలి పట్టుకుని విలన్స్‌ను ఊచకోత కోస్తూ మోస్ట్ వయలెంట్‌గా కనిపిస్తున్నాడు. సూట్ వేసుకుని, మాస్కులతో గుంపులుగా వస్తున్న విలన్స్‌ని పంచె కట్టుతో స్టైలిష్‌గా నరుకుతున్నాడు రణ్‌బీర్. సినిమా ఇంకెంత వయలెన్స్‌గా ఉంటుందో రుచి చూపిస్తూ 50 సెకన్ల టీజర్‌తోనే అంచనాలు పెంచేశాడు సందీప్ రెడ్డి. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు హైలైట్‌గా ఉంది. త్వరలోనే కంప్లీట్ టీజర్‌ను కూడా రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు మేకర్స్. అనిల్ కపూర్, బాబీ డియోల్, పరిణీతి చోప్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.