
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్(Animal). టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందనా(Rashmika Mandana) హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి ప్రీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ ప్రీ టీజర్ లో రణబీర్ గొడ్డలి పట్టుకొని విలన్స్ ను నరుకుతూ మోస్ట్ వైలెంట్ గా కనిపిస్తున్నాడు. మరోసారి సందీప్ తన స్టైల్ ఆఫ్ వైలెన్స్ ను తెరపై చూపించనున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతోంది. ఇక త్వరలోనే ఫుల్ టీజర్ రిలీజ్ కానుంది.
ప్రీ టీజర్ కు ఆడియన్స్ నుండి భారీ స్పందన వచ్చింది. దీంతో యానిమల్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ సంస్థ T సిరీస్ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.