వనపర్తిలో ర్యాండమైజేషన్ పూర్తి

వనపర్తిలో ర్యాండమైజేషన్ పూర్తి

వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గంలో ఈవీఎం, వీవీ ప్యాట్ల రెండో విడత ర్యాండమైజేషన్  పూర్తయిందని కలెక్టర్​ తేజస్  నందలాల్ పవార్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ లో ఎన్నికల పరిశీలకుడు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈవీఎం, వీవీ ప్యాట్లను ఆన్​లైన్  వెబ్  ద్వారా రెండో ర్యాండమైజేషన్  పూర్తి చేసినట్లు తెలిపారు.

నియోజకవర్గంలోని 296 పోలింగ్ స్టేషన్లకు 370 కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, 414 వీవీ ప్యాట్లను కేటాయించామని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రతినిధులు సహకరించాలని కోరారు. వనపర్తి రిటర్నింగ్  అధికారి ఎస్.తిరుపతి రావు, నోడల్  ఆఫీసర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.