ఛలో తరహా మరో విజయం

ఛలో తరహా మరో విజయం

నాగ శౌర్య, యుక్తి తరేజ జంటగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం ‘రంగబలి’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు లభిస్తున్న రెస్పాన్స్ గురించి తెలియజేసేందుకు శనివారం ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. నాగశౌర్య మాట్లాడుతూ ‘సినిమా చూసిన  ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ‘ఛలో’ తర్వాత నాకు ‘రంగబలి’ మరో బ్లాక్ బస్టర్. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ప్రమోషన్స్‌‌లో భాగంగా ఇటీవల కొందరు జర్నలిస్టులను అనుకరిస్తూ చేసిన స్పూఫ్ వీడియోతో ఎవరైనా హర్ట్ అయితే మమ్మల్ని క్షమించండి’ అని చెప్పాడు.  తాను నటించిన మొదటి సినిమా సక్సెస్ అవడం హ్యాపీగా ఉందంది యుక్తి తరేజా.  

పవన్ బాసంశెట్టి మాట్లాడుతూ ‘ఫస్ట్ హాఫ్‌‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. శౌర్య అన్న, సత్య, రాజ్ కుమార్ పాత్రలు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తున్నాయి. సెకెండ్ హాఫ్‌‌లో  మంచి కథ, సందేశాన్ని చెప్పాం. యూత్ ఫ్యామిలీ ఆడియెన్స్  ఎంజాయ్ చేస్తున్నారు. కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని చెప్పాడు.