అప్పు చేసి అభివృద్ధి చేసిన సర్పంచ్.. నిధులు రాక ఆత్మహత్య

అప్పు చేసి అభివృద్ధి చేసిన సర్పంచ్.. నిధులు రాక ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కాశగూడెం సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు షేక్ అజారుద్దీన్.  డిగ్రీ చదువుకున్న అజారుద్దీన్ ను కాశగూడెం ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్ ను చేశారు. దీంతో.. గ్రామ పంచాయితీకి నిధులు వస్తాయన్న ఆశతో అప్పు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేశారంటున్నారు కుటుంబ సభ్యులు. అనుకున్నట్టుగా నిధులు రాకపోవడంతో కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. ఆర్థిక ఇబ్బందులతో భార్య దగ్గర ఉన్న వెండి వస్తువులను అమ్మడంతో కుటుంబం కలహాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.

కాశగూడెం చిన్న పంచాయితీ కావడంతో ఆర్థిక వనరులు లేక.. ప్రభుత్వం నుంచి నిధులు రాక.. ఆర్థిక ఇబ్బందులతో పురురుల మందు తాగారు అజారుద్దీన్. కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించే మార్గమధ్యలో సర్పంచ్ అజారుద్దీన్ చనిపోయారు. సర్పంచ్ కాక ముందు.. కంకర కొట్టి జీవనం సాగించే అజారుద్దీన్.. ప్రజా ప్రతినిధి కావడంతో.. పనులు బంద్ చేసి.. ప్రజలకోసమే నిత్యం తిరిగే వాడని.. బంధువులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే.. తమ సర్పంచ్ బతికేవారంటున్నారు గ్రామ ప్రజలు.