హైదరాబాద్, వెలుగు: బంజారాహిల్స్ బీఎన్‌రెడ్డి కాలనీలో ఖరీదైన రేంజ్ రోవర్ కారులో నుంచి మంటలు చెలరేగాయి. బీఎన్ రెడ్డి కాలనీలో ఉండే బిజినెస్ మ్యాన్పునీత్కు చెందిన రేంజ్ రోవర్ కారులో డ్రైవర్సోము మంగళవారం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లాడు. తిరిగి బీఎన్ రెడ్డి కాలనీ గేటులోకి రాగానే వెహికిల్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఏం జరిగిందని డ్రైవర్ దిగి చూడగా కారు ముందు భాగంలో నుంచి మంటలు కనిపించాయి. వెంటనే అతడు యజమానికి సమాచారం ఇచ్చాడు. అలాగే ఫైర్ స్టేషన్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు కారు సగానికి పైగా కాలిపోయింది.
