తగ్గనున్న రేంజ్ రోవర్ కార్ల ధరలు

తగ్గనున్న రేంజ్ రోవర్ కార్ల ధరలు

ముంబై : టాటా మోటార్స్ యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్​ఆర్​) భారతదేశంలోనే తన రేంజ్ రోవర్  స్పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించనుంది. యూకే వెలుపల రేంజ్​ రోవర్​ కార్లు తయారు చేయడం ఇదే మొదటిసారి.   ఇప్పటి వరకు యూకేలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్  సోలిహుల్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రమే ఉత్పత్తి అయ్యాయి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 121 మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఎగుమతి అవుతున్నాయి. ఈ బ్రిటిష్ బ్రాండ్ భారతదేశంలోని పెద్ద సంఖ్యలో కస్టమర్ల అవసరాలను తీర్చడానికి ఇక్కడికి రావాలని నిర్ణయించుకుంది.

 స్థానిక ఉత్పత్తితో రెండు మోడళ్ల ధర 18–-22 శాతం వరకు తగ్గనుంది.  టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా 15 ఏళ్ల క్రితం టాటా కుటుంబానికి జేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చారని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రశంసించారు. రేంజ్ రోవర్​ను భారతదేశంలోనే తయారు చేస్తారనేది ఒక సూపర్ ఫీలింగ్ అని కామెంట్​ చేశారు.   మున్ముందు దేశంలో విక్రయాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 

మొదట రెండు మోడల్స్​

జేఎల్​ఆర్​ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా మాట్లాడుతూ, దేశంలోని వినియోగదారుల కోసం రెండు మోడళ్లను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.   జేఎల్​ఆర్​ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రిటైల్ అమ్మకాలు 81 శాతం పెరిగి 4,436 యూనిట్లుగా నమోదయ్యాయి.   ఈ కంపెనీ​ కూడా రాబోయే నాలుగేళ్లలో భారతదేశంలో ఆరు కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోందని అంబా పేర్కొన్నారు. 

 స్థానిక ఉత్పత్తి వల్ల ఈ ఏడాది ఆగస్టులో డెలివరీలకు అందుబాటులో ఉండే రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర ప్రస్తుతం రూ.1.9 కోట్లతో పోలిస్తే రూ.1.4 కోట్లకు తగ్గుతుందని అంబా చెప్పారు.   కంపెనీ ఇప్పటికే రేంజ్ రోవర్ వెలార్, రేంజ్ రోవర్ ఎవోక్, జాగ్వార్ ఎఫ్-పేస్,  డిస్కవరీ స్పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పూణేలో అసెంబుల్ చేస్తోంది.