నెలరోజుల ముందుకు మర్దానీ 3.. జనవరి 30న రిలీజ్

నెలరోజుల ముందుకు మర్దానీ 3.. జనవరి 30న రిలీజ్

బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ లీడ్ రోల్‌‌‌‌లో నటించిన ‘మర్దానీ’ ఫ్రాంచైజీకి హిందీలో మంచి సక్సెస్ ట్రాక్ ఉంది. గత  పదేళ్లలో వచ్చిన రెండు సీజన్లకు ఆడియెన్స్‌‌‌‌ నుంచి  మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియాలోనే ఏకైక లేడీ కాప్ ఫ్రాంచైజీగా మర్దానీ రికార్డులు క్రియేట్ చేసింది.  ప్రస్తుతం అభిరాజ్ మినవాల దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఆదిత్య చోప్రా ‘మర్దానీ 3’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌‌‌‌ను ప్రకటించారు మేకర్స్. 

జనవరి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని అనౌన్స్ చేశారు. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 27న విడుదల చేయాలని భావించినా.. అవుట్‌‌‌‌పుట్ అంతా  సిద్ధంగా  ఉండటంతో నెలరోజుల ముందుకు ఈ చిత్రాన్ని ప్రీ పోన్ చేశారు. మంచి, చెడుకి జరిగే పోరాటాల్ని ‘మర్దానీ 3’లో చూపించబోతున్నట్టుగా మేకర్స్ తెలియజేశారు. 

డేర్ డెవిల్ పోలీస్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణీ ముఖర్జీ  మరోసారి కనిపించబోతున్నారు. దాదాపు నాలుగైదు ఏళ్ల తర్వాత ఆమె ప్రధాన పాత్రలో కనిపిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.