శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే

శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే

ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రణిల్ విక్రమసింఘే నియమితులైన విషయం తెలిసిందే. కాగా తాజాగా శ్రీలంక అధ్యకుడిగా రణిల్ బాధ్యతలు చేపట్టారు. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ఎదుట ప్రమాణం చేసిన రణిల్... ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంకను గట్టెక్కించేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని ప్రతిపక్షాలకు హామీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అక్కడి ప్రజలు అధ్యకుడు గొటబాయకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో రాజపక్స రాజీనామా చేయకుండానే దేశం విడిచి పారిపోయారు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే నియామకమయ్యారు. అనంతరం ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.