రిఫా (బహ్రెయిన్): ఇండియా యంగ్ అథ్లెట్ రంజనా యాదవ్.. ఆసియా యూత్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్‌తో మెరిసింది. గురువారం జరిగిన బాలికల 5 వేల మీటర్ల వాక్‌లో రంజన 23ని.25.88 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో ప్లేస్‌లో నిలిచింది.
ఆసియా యూత్ గేమ్స్ అథ్లెటిక్స్‌లో ఇండియాకు ఇది తొలి పతకం కావడం విశేషం. లియు షియి (చైనా, 24:15.27సెకన్లు), జియోంగ్ చాయియోన్ (కొరియా, 25:26.93 సెకన్లు) వరుసగా గోల్డ్, బ్రాంజ్‌ను సాధించారు. ఓవరాల్‌గా ఇండియా ఖాతాలో రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.
