
హైదరాబాద్, వెలుగు: రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌కు తొలి ఓటమి ఎదురైంది. కటక్‌లో ఆదివారం ముగిసిన గ్రూప్–బి మ్యాచ్‌లో హైదరాబాద్ 72 రన్స్ తేడాతో బెంగాల్ చేతిలో ఓడింది. 239 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 16/3తో నాలుగో రోజు సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 166 రన్స్‌కే ఆలౌటైంది. యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ (90) ఒంటరి పోరాటం చేసినా మిగతా ప్లేయర్లు ఫెయిలయ్యారు. బెంగాల్ బౌలర్లలో ఆకాశ్ దీప్ 4, షాబాజ్ అహ్మద్ మూడు వికెట్లతో దెబ్బకొట్టారు. మార్చి 3 నుంచి జరిగే గ్రూప్ చివరి, మూడో మ్యాచ్‌లో బరోడాతో హైదరాబాద్ పోటీ పడనుంది.